మరో రీమిక్స్ సాంగ్ లో ఎన్టీఆర్
రీమిక్స్ సాంగ్ ల జోరు పెరుగుతోంది. తమకు నచ్చిన సూపర్ హిట్ సాంగ్ ని తాజా చిత్రాల్లో జాలిగా రీమిక్స్ చేస్తున్నారు. రీమిక్స్ జోరులో కొన్ని పాటలు అలరిస్తుంటే మరికొన్ని కర్ణకఠో రంగా ఉంటున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఎన్టీఆర్ మరో పాటని రభస కోసం రీమిక్స్ చేయబోతున్నారు. ఇంతకుముందు అల్లరి రాముడు చిత్రం లో వేటగాడు లోని ''ఆకుచాటు పిందే తడిసే'' పాటని రీమిక్స్ చేశాడు. ఆ తర్వాత యమదొంగ చిత్రం లో యమగోల లోని ''ఓలమ్మీ తిక్కరేగిందా.....''పాటని రీమిక్స్ చేసి వాడుకున్నాడు. ఇప్పుడు కొండవీటి సింహం చిత్రంలోని'' అత్తమడుగు వాగులోనా అత్తకూతురో'' అనే పాటని రభస చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రీమిక్స్ సాంగ్ ని ఎన్టీఆర్, అక్ష లపై చిత్రీకరించనున్నారు. ఇటీవలే రాజస్తాన్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.
0 comments: